ఉత్తమ్ అడ్డాలో తీన్మార్ మల్లన్న..అంత ఈజీ కాదుగా!

-

తీన్మార్ మల్లన్న…సొంతంగా కింది స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగిన నేత. ఒక యూట్యూబ్ చానల్ ద్వారా ప్రజా సమస్యలని వినిపిస్తూ..ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ముందుకు నడిచిన నాయకుడు. ఇక సొంతంగా తనకంటూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. అలాగే ఇండిపెండెంట్‌గా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసి అధికార టీఆర్ఎస్‌కు చెమటలు పట్టించారు. అలా తమకు కొరకరాని కొయ్య మాదిరిగా తయారైన మల్లన్నని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిందో అందరికీ తెలిసిందే.

అలా ఇబ్బందులకు గురైన మల్లన్న…చివరికి బీజీపేలో చేరి ఒక రాజకీయ నాయకుడుగా మారారు. అయితే మల్లన్న బీజేపీలో చేరడంపై ఆయన ఫాలోవర్లు కొంత అసంతృప్తిగా ఉన్నారు. కానీ దానికి కూడా మల్లన్న వివరణ ఇస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ని గద్దె దించే సత్తా బీజేపీకి ఉందని, అలాగే తక్కువ అవినీతి గల పార్టీ అని..బీజేపీలో చేరానని, ఆ విషయం తన అనుచరులు అర్ధం చేసుకోవాలని కోరుతున్నారు.

మొత్తానికి మల్లన్న ఒక రాజకీయ నాయకుడు అయ్యారు. మల్లన్న రాకతో బీజేపీకి కాస్త అడ్వాంటేజ్ కూడా వస్తుందనే చెప్పాలి. యువతపై కాస్త పట్టు దొరుకుతుంది. ఇలా బీజేపీలో చేరి కీలకంగా మారిన మల్లన్నకు నెక్స్ట్ ఎన్నికల్లో ఏ సీటు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మల్లన్న ఎలాగైనా నెక్స్ట్ పోటీ చేయడం ఖాయం. కానీ ఏ సీటు నుంచి పోటీ చేస్తారనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం మల్లన్న…హుజూర్‌నగర్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మల్లన్నది ఉమ్మడి నల్గొండ జిల్లా అనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే 2019 హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో మల్లన్న ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. కానీ డిపాజిట్ దక్కించుకోలేదు. ఈ సారి ఆయన బీజేపీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. కానీ హుజూర్‌నగర్ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కంచుకోట…అక్కడ ఆయనకు చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. అటు టీఆర్ఎస్‌కు అక్కడ బలం ఉంది. అలాంటప్పుడు ఆ రెండు పార్టీల మధ్య…మల్లన్న ఏ మేరకు సత్తా చాటతారనేది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version