బీహార్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ గా చేసుకుని ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తేజశ్వి యాదవ్ ఒక లేఖ రాశారు. ఐదేళ్ల క్రితం ఇచ్చి కూడా నెరవేరని హామీలను ఆయన అందులో ప్రస్తావించారు. నవంబర్ 1 వ తేదీ రాసిన ఈ లేఖను ఆయన నేడు బయట పెట్టారు.
“గత ఆరు సంవత్సరాలుగా బీహార్ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలను మీరు మరచిపోలేదని నేను నమ్ముతున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సహా 1.25 లక్షల కోట్ల హామీలు ఉన్నాయి. ఆర్థిక ప్యాకేజీ హామీ కూడా ఇచ్చారు. బీహార్ ప్రత్యేక హోదాను తిరస్కరించడానికి చట్టాలు ఎంతకాలం సాకుగా చూపిస్తారు అని ప్రశ్నించారు. 40 మంది ఎంపీలలో 39 మందిని మీకు ఇచ్చిన రాష్ట్ర ప్రజల కోసం ఈ చట్టాలను సవరించలేరా? అని ప్రశ్నించారు.