ఆంధ్ర – తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం !

-

అదేంటి ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోవడం ఏమిటా అనుకుంటున్నారా ? ఇటీవల వచ్చిన వర్షాల వల్ల బ్రిడ్జి ఒక్కవైపు కుంగిపోవడంతో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ బ్రిడ్జి కూడా కరెక్ట్ గా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోనే జరుగడంతో అక్కడ బారికేడ్ లు చెక్ పోస్టులు లాగా కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ సరిహద్దులో కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి వద్ద ఉన్న బ్రిడ్జి ఇటీవల వచ్చిన వర్షాలకు దెబ్బతింది.

ఆంధ్ర ప్రదేశ్ లోని గంపలగూడెం మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ పనుల కోసం ఖమ్మం జిల్లాలోని వైరా, తల్లాడ మండలాలకు చెందిన వారు రోజూ వెళ్లి వస్తుంటారు. రాకపోకలు నిలిచిపోవడంతో వందలాది మంది వ్యవసాయ కూలీలు ట్రాక్టర్ లలో బ్రిడ్జి దాకా వచ్చి ఆగిపోతున్నారు. ఇటు వైపు కు కొద్ది దూరం నడిచి వచ్చి ఆ తరువాత మళ్లీ ఆటోలను ఎక్కవలసి వస్తుంది. దీంతో అటు కూలీలు, ఇటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి చాలా మంది గంపలగూడెం మండలానికి చెందిన వారు ఇటు వైపు నుంచే వెళుతుంటారు. వారంతా ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version