రాష్ట్ర తొలి అసెంబ్లీని రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ పిలుపుతో నేడు మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గ తీర్మానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఐదు నిమిషాల పాటు జరిగిన సమావేశంలో మంత్రివర్గం సంబంధిత దస్త్రం పై సంతకం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు బయలుదేరిన కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలిసి తీర్మానాన్ని అందజేసి, తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ రద్దుకు సిఫారసు చేసారు. దాదాపు 25 నిమిషాలకు పైగా గవర్నర్ తో కొనసాగిన సమావేశంలో అసెంబ్లీ రద్దుకు సంబంధించి కారణాలను సీఎం వివరించారు. అనంతరం గవర్నర్ అసెంబ్లీ రద్దుకు ఆమోదం తెలిపారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్..కేసీఆర్ ని కోరగా దీనికి ఆయన సమ్మతిని తెలియజేశారు.
గవర్నర్ తో భేటీ అనంతరం ప్రగతి భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి 2.30 నిమిషాలకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసెంబ్లీ రద్దుకు సంబంధించి కారణాలను వివరించనున్నారు.