తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను విడుదల చేసే షియోమీ ఈ సారి ఏకంగా 3 కొత్త స్మార్ట్‌ఫోన్లను ఇండియన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. రెడ్‌మీ 6 సిరీస్‌లో ఈ కొత్త ఫోన్లు విడుదలయ్యాయి. రెడ్‌మీ 6, 6ఎ, 6ప్రొ పేరిట ఈ ఫోన్లు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. మరి వీటిల్లో ఉన్న ఫీచర్లు, ఈ ఫోన్ల ధరలు, లభ్యమయ్యే తేదీలు.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
షియోమీ రెడ్‌మీ 6 ఫోన్‌లో 5.45 ఇంచుల డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.7,999, రూ.9,499 ధరలకు వినియోగదారులకు ఈ నెల 10వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది.
షియోమీ రెడ్‌మీ 6ఎ స్మార్ట్‌ఫోన్‌లో 5.45 ఇంచ్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ ఫీచర్లు ఉన్నాయి. 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.5,999, రూ.6,999 ధరలకు వినియోగదారులకు ఈ నెల 19వ తేదీ నుంచి అమెజాన్ సైట్‌లో లభ్యం కానుంది.
షియోమీ రెడ్‌మీ 6 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి. 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.10,999, రూ.12,999 ధరలకు వినియోగదారులకు ఈ నెల 11వ తేదీ నుంచి అమెజాన్‌లో లభ్యం కానుంది.