నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

-

అమర వీరులకు నివాళులర్పించిన తర్వాత అసెంబ్లీకి సీఎం…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం కొలువుదీరనుంది. అసెంబ్లీ సమావేశాలను అధ్యక్షత వహించేందుకు బుధవారం రాజ్‌భవన్‌లో సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. దీంతో ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ముంతాజ్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశమవుతుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రమాణం చేయిస్తారు.  ముందుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, తర్వాత మహిళాసభ్యులు ప్రమాణం స్వీకరిస్తారు.

ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఆల్ఫాబేటికల్ లెటర్స్ ఆధారంగా మిగతాసభ్యులు ప్రమాణస్వీకారం,

జూబ్లీహాల్‌లో ప్రభుత్వం అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు గురువారం నామినేషన్లు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేస్తారు.

స్పీకర్‌గా పోటీచేయాలనుకొనే సభ్యులు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

18న స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఒకే నామినేషన్ దాఖలైతే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.

గవర్నర్ నరసింహన్ 19న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ, కౌన్సిల్‌లో వేర్వేరుగా చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు 20 వరకు కొనసాగనున్నాయి. తెరాస రెండో సారి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న తరుణంలో సీఎం, మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రధాన్యతను సంతరించుకోనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version