అవును.. చందమామపై ఫస్ట్ టైమ్ ఓ విత్తనం మొలకెత్తింది. దీంతో.. చంద్రుడు మానవ నివాసానికి అనుకూలం అని తెలిసిపోయింది. చంద్రుడిపై పంటలు పండించి.. మనుషులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలనుకున్న సైంటిస్టుల ప్రయత్నాలకూ మొదటి అడుగుపడింది. చైనా రీసెంట్‌గా చేంజ్ 4 ప్రోబ్ అనే మిషన్‌ను పంపించింది. దానిలో కొన్ని విత్తనాలను అమర్చి చంద్రమామ పైకి పంపించారు. అది చంద్రుడిపై దిగిన తర్వాత ఆ విత్తనాలను చంద్రుడి మీద వదిలేసింది. అలా వదిలేసిన చాలా విత్తనాలు మొలకెత్తలేదు కానీ.. ఒక్క పత్తి విత్తనం మాత్రం మొలకెత్తింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ప్రోబ్ సైంటిస్టులకు పంపించింది. దీని వల్ల చంద్రుడిపై ఇంకా పరిశోధన చేయడానికి అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు.. తమ ఆహారాన్ని అక్కడే పండించుకొని తినొచ్చు. ఇలా.. చంద్రుడిపై నివాసానికి అవసరమయ్యే ఎన్నో ప్రశ్నలకు ఈ పత్తి విత్తనం సమాధానం చెప్పింది. దీంతో ప్రోబ్ మిషన్ సైంటిస్టుల బృందం హర్షం వ్యక్తం చేసింది.
చంద్రుడిపై మొదటి సారి మొలకెత్తిన పత్తి విత్తనం
-