ఈ నెల 13న శాసన సభ, 14న శాసన మండలి సమావేశాలు నిర్వహించాలని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13న అసెంబ్లీ సమావేశం ఉదయం 11:30గంటలకు, మండలి సమావేశం 14న ఉదయం 11గంటలకు ప్రారంభం అవుతుందని తెలంగాణా ప్రభుత్వం ప్రకటన చేసింది. 13న అసెంబ్లీలో ప్రవేశ పెట్టే తీర్మానాలను, 14న మండలిలో ప్రవేశ పెడతారని పేర్కొంది.
రేపు సాయంత్రం తెలంగాణా కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే తీర్మానాలను చర్చిస్తుంది కేబినేట్. కరోనా పరిస్థితిపై కూడా రేపటి కేబినేట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకు కేబినేట్ భేటీ ఉండొచ్చు. పంటల సాగు విధానం, ధాన్యం కొనుగోలుపై కేబినేట్ చర్చిస్తుంది.