Telangana : డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్

-

నిన్న టెట్ 2024 ఫ‌లితాలు విడుద‌లైన నేప‌థ్యంలో డీఎస్సీ ద‌ర‌ఖాస్తుల‌ను విద్యాశాఖ అప్ర‌మ‌త్తం చేసింది.టెట్ లో అర్హత సాధించిన వారు డీఎస్సీకి చేసుకున్న దరఖాస్తుల్లో ఎడిట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. టెట్ మార్కులతో పాటు ఇతర వివరాలు ఎడిట్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. నిన్న టెట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు డీఎస్సీకి ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫెయిల్ అయిన వారు డిసెంబర్లో జరిగే టెట్కు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చని వివరించింది.

పేపర్‌1కు 85,996 మంది, పేపర్‌2 పరీక్షకు 1,50,491 మంది అభ్యర్థులు హాజరు కాగా …టెట్‌ పేపర్‌ -1లో 57,725 (67.13%), పేపర్‌ -2లో 51,443 (34.18%) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గత ఏడాదితో టెట్‌తో పోల్చితే ఉత్తీర్ణత శాతం పెరగడం విశేషం. పేపర్‌ -1లో ఏకంగా 30.24శాతం, పేపర్‌ -2లో 18.88శాతం ఉత్తీర్ణతశాతం పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news