బండి సంజయ్ వెంట్రుక కూడా పీకలేవు : మైనంపల్లిపై తెలంగాణ బిజెపి ఫైర్

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కు కౌంటర్ ఇచ్చింది తెలంగాణ బిజేపి. మైనంపల్లి జాతీయ పతాకాన్ని అవమానించాడని.. దొరల అహంకారాన్ని చూపెడుతున్నాడని bjym రాష్ట్ర అధ్యక్షుడు బాను ప్రకాష్ ఫైర్ అయ్యారు. బీసీ లు ఏకం అవుతారు… తరిమి కొడతారని హెచ్చరించారు. మల్కాజ్ గిరి లో మైనంపల్లి అహంకారాన్ని పాతి పెడతామన్నారు. చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని.. అతని పై 307 కేసు నమోదు అయిందన్నారు.

కరీంనగర్ ప్రజలు మైనంపల్లిని ఉరికించి కొడతారని హెచ్చరించారు. అనంతరం బిజేపి నేత కొప్పు బాషా మాట్లాడుతూ.. మైనంపల్లి నీకు తలకాయ ఉందా… ఏమి మాట్లాడుతున్నావ్ ? అని ఫైర్ అయ్యారు. “బండి సంజయ్ వెంట్రుక కూడా పీక లేవు. చీటర్ వు నువ్వు.. నువు ఎమ్మెల్యే వారా. బొచ్చు కూడా పీక లేవు… ఎట్ల పుట్టినవ్ రా” అంటూ తీవ్ర స్థాయిలో ద్వజ మెత్తారు. అంబెడ్కర్, మహాత్మాగాంధీ ఫొటో లను తాంతవా? అని ప్రశ్నించారు. కరీంనగర్ వస్తావా, మేమే మల్కాజ్ గిరి వస్తామని సవాల్ విసిరారు. బండి సంజయ్ గురుంచి మాట్లాడేందుకు మరో జన్మ ఎత్తాలంటూ అగ్రహించారు. కార్పొరేటర్ ని తట్టుకోలేక పోతున్నావు… రాష్ట్ర అధ్యక్షుడుని అంటావా ? అని నిలదీశారు.