2022-23 తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. మూడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తెలంగాణ పయణిస్తోందని ఆయన అన్నారు. దేశంలో తెలంగాాణ ఓ టార్చ్ బేరర్ గా నిలిచిందని ఆయన అన్నారు. ఈ రోజు తెలంగాణ ఏం అవలంభిస్తుందో.. రేపు దేశం అదే చేస్తుందని అన్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని అన్నారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం కేంద్ర పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
దేశంలో తెలంగాణ ఓ టార్చ్ బేరర్- హరీష్ రావు
-