తెలంగాణ మంత్రి వర్గ సమావేశం వాయిదా

-

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మే 18వ తేదీ శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది.

అయితే, కేబినెట్ సమావేశం సాయంత్రం 7 గంటల వరకు కూడా ప్రారంభం కాలేదు. దీంతో కేబినేట్ సమావేశంపై ఉత్కంఠ కొనసాగింది. క్యాబినెట్ బేటి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరినా.. ఎన్నికల సంఘం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో సీఎంఓ వర్గాలు ఎన్నికల సంఘం పర్మిషన్ కోసం వేచిచూశాయి. పర్మిషన్ పై క్లారిటీ రాకపోవటంతో.. సెక్రటేరియట్ లో ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ సహా.. ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సమావేశంలో చర్చిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version