తెలంగాణా క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి మొదలు అయిన ఈ క్యాబినెట్ సమావేశం, సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కీలకంగా భావిస్తోన్న GHMC చట్ట సవరణ బిల్లుని మంత్రివర్గం ఆమోదించింది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని ఇప్పటిదాకా ఉన్న నిబంధనను తొలగించేలా చట్టాన్ని సవరించాలని నిర్ణయం తీసుకున్నారు.
అలానే కార్పొరేటర్ లకి ఇచ్చే నిధులను కూడా సవరణ చట్టంలో చేర్చనుంది. అలానే పదేళ్ళ పాటు ఇప్పుడున్న డివిజన్ల రిజర్వేషన్ కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. ఇక క్యాబినెట్ ఆమోదించిన ఈ GHMC చట్టం మరో రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేయనున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టంగా మారే అవకాశం ఉంది. ఇక ఈ సుదీర్ఘ సమావేశంలో పంటల సాగు, పంటల కొనుగోలు, థియేటర్ల ఓపెనింగ్, విద్యాసంస్థలు ఎప్పటి నుండి ఓపెన్ చేయాలి అనే అంశాల మీద కూడా చర్చ జరిగింది.