తెలంగాణాలో కరోనా కేసులు కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. రోజు రెండు వేలకి పైగా నమోదవుతున్న కేసులు ఈరోజు కాస్త తక్కువే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,102 కేసులు నమోదయినట్టు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య, 91,361కు చేరింది. ఇక గడచిన 24 గంటల్లో తొమ్మిది మంది మరించారు. దీంతో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 693కు చేరింది. గడచిన 24 గంటల్లో 1,930 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి దాకా మొత్తం 68,126 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇక తెలంగాణాలో ప్రస్తుతానికి 22,542 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి, అందులో 15,502 మంది ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండగా మిగతా వారు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇక గడచిన 24 గంటల్లో 12,120 టెస్టులు చేయగా, ఇప్పటిదాకా చేసిన టెస్ట్ల సంఖ్య 7,44,555కు చేరింది. ఇక ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో కేసులు భారీగానే నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 234 కేసులు, కరీంనగర్ లో 101 కేసులు, రంగారెడ్డిలో 81 కేసులు, సంగారెడ్డిలో 66 కేసులు నమోదయ్యాయి. అయితే రోజూ ఇరవై వేలకు పైగా చేసే టెస్టులు ఈరోజు పదివేలే చేయడంతో కరోన కేసులు తగ్గినట్టు చెబుతున్నారు.