తెలంగాణా కరోనా : 1,637 కేసులు, 6 మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,637 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,44,143 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో ఆరుగురు మరణించారు. ఇప్పటి వరకు 1357మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 18100 ఉన్నాయి.

carona telangana
carona telangana

వారిలో 15,335 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,24,686 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,273 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 92.03% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 92.1% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.55%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 45,526 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 44,39,856 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 292 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news