తెలంగాణలో పెరిగిన కరోనా..గడిచిన 24 గంటల్లో 213 కేసులు…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటి కంటే ఇవాల్టి రోజున కరోనా మహమ్మారి కేసులు కాస్త పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడచిన 24 గంటల్లో కొత్తగా… 213 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి.

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,76, 787 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కేవలం కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 3998 మంది కరోనా మహమ్మారి తో మరణించారు.ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 1964 గా ఉన్నాయి.ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,69, 010 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.

గత 24 గంటల్లో 156 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 98.85 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 98.36 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.59% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 39, 495 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 2,87 ,38 ,462 కు చేరుకుంది.