తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా : కొత్తగా 183 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు తగ్గి పోతున్నాయి. గతంలో వెయ్యికి పైగా నమోదైన కరోనా కేసులు… ఇప్పడు కేవలం 500 లోపే నమోదవడం కాస్త ఊరట కలిగించే అంశం. అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 183 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,68,070 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3932 మంది కరోనా మహమ్మారి తో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 4196 గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6, 59, 942 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 220 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 40, 354 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 2,68,30, 468 కు చేరుకుంది.  తెలంగాణలో రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 97. 98 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.58% గా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news