సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, TSCSBలో ఫిర్యాదు చేసారు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి. ఇక వివరాల లోకి వెళితే.. తన పేరు అలానే డీపీ ని ఉపయోగించి ఫేక్ కాల్స్ చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, TSCSBలో సీఎస్ శాంతి కుమారి కంప్లైంట్ ని ఇచ్చారు. తెలంగాణకు చెందిన కొంత మంది వ్యక్తులు ఫ్రాడ్ చేస్తున్నారని… తన పేరు, డీపీని ఉపయోగించి మొబైల్ నంబర్ +977-984-4013103 తో నకిలీ కాల్స్ చేస్తున్నారని ఆమె అన్నారు.
వాళ్లని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, TS సైబర్ సెక్యూరిటీ బ్యూరో(TSCSB) లో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి కంప్లైంట్ చేసారు. ఎఫ్ఐఆర్ నెం. 4/2024 కింద కేసు ని బుక్ చేయడం జరిగింది.