మల్కాజ్ గిరిలో ప్రతీ ఒక్కరి సమస్యను పరిష్కరిస్తా : ఈటెల రాజేందర్

-

మల్కాజ్ గిరిలో ప్రతీ ఒక్కరి సమస్యను పరిష్కరిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తాజాగా ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నాగోల్ లో శుభం కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన ఇంటలెక్చువల్స్, ఎడ్యుకేషనలిస్ట్ సమావేశంలో మాట్లాడారు ఈటల. నా 22 సంవత్సరాల రాజకీయ జీవితం మీ అందరికీ తెలుసు. ఎవరైనా అకారణంగా, అన్యాయంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, న్యాయమైన సమస్యలు కూడా పరిష్కరించకుండా అధికార పార్టీలు ప్రవర్తిస్తే వారితో కొట్లాడతానని మీకందరికీ తెలుసు. ఈ ఎన్నికల అనంతరం తప్పకుండా మీ సమస్యలన్నింటికీ సానుకూల పరిష్కారాలు చేస్తామని హామీ ఇస్తున్నానని తెలిపారు.

 

దేశ ప్రధానిని నిర్ణయించే ఈ పార్లమెంట్ ఎన్నికలలో మరొక్కసారి నరేంద్రమోదీనే గెలిపించుకోవాలని ప్రజలు ఎన్నడో నిర్ణయించుకున్నారు. మీరందరూ విజ్ఞులు, కొన్ని సంవత్సరాలుగా అనేకమందితో సంబంధాలు ఉన్నవారు మీరు. ఇంటలెక్చువల్స్ అయిన మీలాంటి వారు చాలా తొందరగా అర్థం చేసుకుంటారు. వచ్చే పది రోజుల పాటు నిరంతరంగా పనిచేసి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుతున్నాను.

ఈ మధ్య రాజకీయ నాయకులను చూస్తే మీకు ఎన్నెన్ని హామీలు ఇస్తున్నారో తెలుస్తుంది. ఎన్నికల ముందు అమలు చేయలేని అనవసర హామీలను ఇవ్వడం పార్టీలకు పరిపాటయిపోయింది. కేవలం హామీలనివ్వడం కాదు ఎవరైతే నిజంగా అమలు చేస్తున్నారో కనిపెట్టండి. ఆబ్లిగేషన్‌తో కాదు, ఎఫిషియన్సీతో ముందుకెల్లే వారిని ఎన్నుకోండి. ప్రలోభాలకు ప్రజలను గురిచేస్తూ ఎలాగైనా గెలవాలని ఎంత ఖర్చయినా పెట్టాలని చూస్తున్నారు నాయకులు.2014లో మొదటి సారి గెలిచినప్పడి కంటే 2018 లో 303 సీట్లతో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఈ మూడవ సారి ఎన్నికలలో కనీసం 370 పైచిలుకు సీట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news