తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సక్సెస్.. 27 మంది అరెస్ట్!

-

రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ పోలీసులు రాజస్థాన్‌లో భారీ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో 27మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు.వారి నుంచి భారీగా చెక్‌బుక్స్ సీజ్ చేశారు. ఆ వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. రాజస్థాన్‌లోని పింప్రీ చించ్ వాడ్ పీఎస్ పరిధిలో ఓ సీనియర్ సిటిజన్‌ను రూ.కోటికి పైగా మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జైపూర్‌కు వాసి మయాంక్ అశోక్‌కుమార్ గోయల్ (20) తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎస్బీఐ, సీబీఐ ఉద్యోగులమని చెప్పి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సందీప్ దోయిఫోడ్ తెలిపారు. 60ఏళ్ల వ్యక్తికి వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి మనీలాండరింగ్ పేరుతో బెదిరించి బ్యాంక్ డిటేల్స్ తీసుకుని రూ.1కోటి 8 లక్షలను దోచినట్లు సమాచారం. ఆ డబ్బును గుజరాత్,రాజస్థాన్‌లకు తరలించారని.. గోయల్ అరెస్టుతో మిగతా ముగ్గురి ఆచూకీ తెలుసుకుని మొత్తంగా ఇందులో ప్రమేయం ఉన్న 27 మందిని కూడా అరెస్ట్ చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version