కరోనా కాలంలో రేపే తొలి ఎంట్రెన్స్ ఎగ్జామ్

-

రేపటి నుండి తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి ఎంట్రెన్స్ పరీక్షలతో పాటు జాతీయ స్థాయి కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు రేపటి నుంచి మొదలు కానున్నాయి. వీటిలో భాగంగా రేపు ఈ సెట్ పరీక్ష జరగనుంది. రేపటి పరీక్షకు 28,015 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కరోన కాలంలో ఇదే మొదటి ఎంట్రెన్స్ టెస్ట్ అని చెప్పచ్చు. ఇక ఈ పరీక్ష ఉదయం సాయంత్రం రెండు విడతలుగా ఆన్లైన్ ద్వారా జరగనుంది. ఉదయం సెషన్ లో 14,415 మంది విద్యార్థులు, సాయంత్రం సెషన్ లో 13,600 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ పరీక్ష కోసం మొత్తం 56 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా అవి తెలంగాణలో 52, ఆంధ్రలో 4 ఏర్పాటు చేశారు.

ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు అలానే మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు పరీక్ష రెండు బ్యాచ్ ల వాళ్ళకి పరీక్ష జరగనుంది. ఉదయం పరీక్షకు అభ్యర్థులు 7.30కు, మధ్యాహ్నం పరీక్షకు 1. 30కు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఇక ఎప్పటిలానే పరీక్ష టైమ్ స్టార్ట్ అయ్యాక ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన నో ఎంట్రీ అమలు చేయనున్నారు. విద్యార్థులు తమ వెంట మాస్క్ లు, వాటర్ బాటిల్స్, సానిటైజర్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. అలానే పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటించాలి, గుంపులు గుంపులుగా ఉండకూడదని అధికారులు పేర్కొన్నారు. ఇక పాలిటెక్నిక్ చదివి డైరెక్టు గా ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదవాలని అనుకునే వారు ఈ పరీక్ష రాస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news