వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా( డబ్ల్యూసీఎస్) నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో తెలంగాణకు రెండు అవార్డులు వరించాయి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ద్వితీయ, తృతీయ అవార్డులు పొందారు.ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖరరావు.. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో తీసిన రాయల్ బెంగాల్ టైగర్ ఫోటోకు రెండో స్థానం దక్కింది.
జన్నారం డివిజనల్ అధికారి సిరిపురపు మాధవరావు.. కవ్వాల్ అభయారణ్యంలో తీసిన అరుదైన జాతికి చెందిన గద్ద ఫోటోకు ( క్రెస్టెడ్ హాక్ ఈగల్ ) మూడో స్థానం దక్కింది.ఫోటోగ్రఫీ అవార్డులు సాధించిన ఇద్దరు అధికారులను అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్.శోభ, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.నల్లమల్ల ప్రాంతంలోని ప్రతాపరుద్రుని కోటను పర్యాటక హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహాన్ తెలిపారు.