తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

-

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. TFCC  స్థాపించి 14 ఏళ్లు అయిందని తెలిపారు. ఇందులో వెయ్యికీ పైగా నిర్మాతలతో పాటు సినిమాలో భాగమైన 24 శాఖలకు చెందిన 16వేల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు. 

TFCC ప్రస్తుత కమిటీ గడువు ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. సెప్టెంబర్ 08న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. TFCC సభ్యులు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇందులో సభ్యులందరికీ ఇన్సూరెన్స్ తో పాటు వారి పిల్లలకు స్కాలర్ షిప్ లు అందిస్తున్నట్టు ఆయన గుర్తుకు చేసారు. సభ్యుల యొక్క సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు ప్రతాని రామకృష్ణ గౌడ్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version