Telangana: గెస్ట్ లెక్చలర్ల పారితోషికం పెంపు

-

తెలంగాణ సర్కార్ గెస్ట్ లెక్చలర్లకు తీపి కుబురు చెప్పింది. ఎన్నో కాలంగా గెస్ట్ లెక్చలర్లు తమ పారితోషికాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వారి కోరికను మన్నించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గెస్ట్ లెక్చలర్ల పారితోషకాన్ని పెంచింది. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చలర్ల పారితోషికాన్ని పీరియడ్ కు రూ. 300 నుంచి రూ. 390కి పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు నెలకు 72 గంటల పాటు పనిచేసేలా, పారితోషికం రూ. 28,080 మించరాదని సీలింగ్ విధించింది. సర్కార్ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 405 జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న రెండు వేల మంది లెక్చలర్లకు ప్రయోజనం చేకూరనుంది. సర్కార్ నిర్ణయం పట్ల లెక్చలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సర్కార్ ఖజాానాపై కొంత ఆర్థిక భారం పడనుంది. అయితే ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version