పూర్వపు రోజుల్లో జుట్టుకు ఆముదాన్ని ఉపయోగించేవారు.అయితే ఈ స్థానాన్ని కొబ్బరి నూనె భర్తీ చేసింది.ఇందుకు కారణం సహజంగా ఆముదానికి ఉండే ఘటైన వాసన మరియు చిక్కదనం. అయితే వారంలో కనీసం ఒక్కసారైనా ఆముదాన్ని జుట్టుకు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ఆముదంలో జుట్టు పెరిగేందుకు అవసరమయ్యే విటమిన్లు,పోషకాలు మరియు ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో ఉండే రిసినోలిక్ అనే ఆమ్లం జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది.
ఆముదం నూనే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. అందువల్ల తలలో ఏర్పడే చుండ్రు మరియు దురద సమస్యలను నివారిస్తుంది.వెంట్రుకలు చిట్లడం వంటి సమస్యలను చెక్ పెడుతుంది.ఆముదం నూనె మన వెంట్రుకలను కుదుళ్ల నుండి బలోపేతం చేసి జుట్టు బాగా పెరిగేందుకు దోహదపడుతుంది. జుట్టు పొడిబారటం మరియు రంగు మారే సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
ఆముదం ఒక సహజ సిద్ధమైన కండిషనర్ల పని చేసి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. జుట్టు తెల్లబడే సమస్యలను తగ్గిస్తుంది. అధిక ఎండా మరియు కాలుష్యం భారీ నుండి జుట్టును కాపాడుతుంది.ఆముదం జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్ ఇ ను సమృద్ధిగా కలిగి ఉంది.ఇది మన జుట్టు రాలే సమస్యలను నివారించి,వెంట్రుకలు బలంగా పెరిగేలా సహాయపడుతుంది.కనీసం వారంలో ఒక్కసారైనా గోర వెచ్చని ఆముదాన్ని వెంట్రుకల కుదుళ్లకు బాగా పట్టించి మృదువుగా మసాజ్ చేసి సుమారు గంట తర్వాత తల స్నానం చేయడం వలన మృదువైన కేశాలను మన సొంతం చేసుకోవచ్చు.