తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ స్వగృహ ప్లాట్లను లాటరీ పద్దతిలో తెలంగాణ ప్రభుత్వం అమ్ముతోంది. పోచారం టౌన్ షిప్ లో ఉన్న 2 టవర్ల లోని 194 ప్లాట్లు.. గాజులరామారం టవర్ లోని 112 ప్లాట్లు లాటరీ విధానంలో కేటాయించారు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల ద్వారా రూ.70.05 కోట్లు అర్జించింది ప్రభుత్వం.

ఇది ఇలా ఉండగా నేటి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. ఇవాళ ఉదయం 11 గంటలకు రేవంత్ రెడ్డి… హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నట్లు ముందుగా ప్రకటన వచ్చింది. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఉంది.