గణేష్ నిమజ్జనం : సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ !

హైదరాబాద్ లోని గణేష్ నిమజ్జనం పై తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి నిరాకరించిన హైకోర్టు…హైకోర్టు తీర్పు నేపథ్యంలో సమాలోచన లో పడింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ట్యాంక్ బండ్ లో నిమజ్జనం ఏర్పాట్లు మొదలు పెట్టారు అధికారులు..

ట్యాంక్ బండ్ లోనే గణేష్ నిమజ్జనం చేస్తామంటున్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.. పోలీసులు నిమజ్జనం కు వచ్చే విగ్రహాలను అడ్డుకుంటే రోడ్డు మీద నే నిరసన వ్యక్తం చేస్తామన్న ఉత్సవ సమితి.. నిమజ్జనం పై అయోమయంలో ఉన్నారు పోలీసులు.

గణేష్ నిమజ్జనం పై నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం చేశారు. నిమజ్జనం పై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు తీర్పు పై కెసిఆర్ చర్చించారు. ఈ నేపథ్యం లోనే హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ప్రత్యమ్నాయా ఏర్పాట్ల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.