హుజురాబాద్‌ ప్రజలకు శుభవార్త..వారి అకౌంట్లల్లో రూ.10 లక్షలు జమ !

హుజురాబాద్‌ నియోజక వర్గ ప్రజలకు తీపి కబురు చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హుజురాబాద్‌ నియోజక వర్గం లోని దళిత బంధు లబ్ది దారులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏకం గా రూ. 14, 400 మంది ఖాతాల్లో నిధులు జమ చేసిన ట్లు ఉన్నతా ధికారులు ప్రకటించారు. లబ్ది దారుల ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున జమ చేసినట్లు పేర్కొన్నారు అధికారులు.

money

అలాగే… హుజురాబాద్‌ నియోజక వర్గం లో వలస వెళ్లిన కుటుంబాల గురించి అధికారులు రీ సర్వే చేయనున్నారు. వారి జాబితా కూడా సిద్ధం చేసి… త్వరలో నే వారందరికీ కూడా దళిత బంధు పథకం నిధులు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దళిత బంధు పథకం అమలు పై ఎలాంటి వదంతులు నమ్మవద్దని అధికారులు మరియు మంత్రులు చెబుతున్నారు. చివరి వ్యక్తి వరకు దళిత బంధు అమలు చేస్తామని… ఎవరూ కూడా ఆందోళన చెందనక్కర్లేదని అధికారులు చెబుతు న్నారు.