కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు రైతుల కోసం ఎన్నో స్కీమ్‌లు, సదుపాయాలు కల్పించింది. అయితే, తాజాగా రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. తెలంగాణలో వ్యవసాయ రంగానికి సేవలు అందించేందుకు, సాగు భూములను డిజిటలైజ్ చేసేందుకు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం చేసుకుంది.
దీని ద్వారా వ్యవసాయ భూములను గూగుల్ ద్వారా గుర్తించి, వాటి మ్యాప్ లను తయారు చేస్తారు. భూములను డిజిటలైజ్ చేసి యజమానులైన రైతుల పేర్లు నమోదు చేస్తారు. ఆ భూముల సారం, ఆయా ప్రాంతాల్లో వాతావరణం, ఏయే పంటలకు అనుకూలం, తదితర అంశాలపై గూగుల్ నేరుగా ప్రభుత్వం, రైతులకు సమాచారం ఇవ్వనుంది.