తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఈ ఏడాది పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించకుండా.. రాజభవన్‌లోనే వేడుకలు జరుపుకోవాలన్న ప్రభుత్వ లేఖపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేడుకలు జరగకపోవడం పట్ల ఆవేదన చెందారు. కరోనా పేరుతో వేడుకలు జరపకపోవడం బాధాకరమని వాపోయారు.
రాజ్‌భవన్‌లోనే ఈ గణతంత్ర వేడుకలకు గవర్నర్ జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడ కూడా గణతంత్రి దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు జరపకపోవడాన్ని తమిళిసై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.
కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసైల మధ్య మొదట్లో విభేదాలు ఉండేవి కావు. పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ సీఎంవో పంపిన ఫైలును గవర్నర్ పక్కన పెట్టడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇక అప్పటి నుంచి ప్రతి కార్యక్రమానికి కేసీఆర్.. గవర్నర్‌ను దూరం పెడుతూనే ఉన్నారు.