దసరా సెలవు ను 25 నుండి 26 కి మారుస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి 2019 చివరిలోనే ఈ ఏడాది దసరా అక్టోబర్ 25వ తేదీ అని ప్రభుత్వం అధికారిక క్యాలెండర్ లో ప్రకటించేసింది. అయితే తిధి ప్రకారం ఈ ఏడాది దసరా అక్టోబర్ 26వ తేదీ అని పలు దేవస్థానాలు ప్రకటించడంతో పండుగ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది.
తిథి, పంచాంగం ప్రకారం దసరా అక్టోబరు 26న ఉన్నందున సెలవలు కూడా 25, 26 తేదీల్లో ప్రకటించాలని ఇప్పటికే సీఎస్ కు చాలా శాఖల నుండి లేఖలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. మరోపక్క నగరంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రతీ బాధిత కుటుంబానికి 10వేల తక్షణసాయం అందజేత ముమ్మరంగా సాగాలన్న ఆయన దసరాలోపే ఈ సాయం అందాలని అన్నారు.