రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం

-

రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రభుత్వం మరో అడుగు వేసింది. అదేంటంటే గత 5 సంవత్సరాల వార్షిక రహస్య నివేదికలు ఇవ్వాలి అని రెవిన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. డిప్యూటీ కలెక్టర్లను, తహశీల్దార్ ల వార్షిక నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లని ఆదేశిస్తూ అంతర్గత సర్క్కులర్ జారీ చేసింది తెలంగాణా సర్కార్. ఈ నివేదికల ఆధారంగానే పదోన్నతులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఈ రోజు తమ కోరికల చిట్టాను సీఎస్ సోమేశ్ కుమార్ ముందు తెలంగాణ రెవెన్యూ అధికారులు ఉంచారు. అంతలోనే అంతర్గత సర్క్కులర్ రావడంపై విస్తృత చర్చ జతుగుతోంది. 5 సంవత్సరం నివేదిక అడగడంతో ఎవరి లోపాలు బయట పడుతాయో అని ఆందోళనలో మునిగిపోయారు రెవెన్యూ అధికారులు. ఎప్పుడో చేసిన తప్పులు ఇప్పుడు తమ ప్రమోషన్ కు ఎక్కడ అడ్డు వస్తాయో అని వారిలో గుబులు మొదలయింది.

Read more RELATED
Recommended to you

Latest news