పార్టీలో బ్లాక్ బెర్రీలా మెరుస్తున్న కాజల్ !

-

అందాల చంద‌మామ కాజ‌ల్ సోష‌ల్ మీడియాలో సంద‌డి చేసి చాలా రోజులే అవుతోంది. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి పుష్క‌ర కాలం కావ‌స్తున్నా ఇంకా కాజ‌ల్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇక త‌న ప‌ని అయిపోయింది అన్న విమ‌ర్శ‌లు వెల్లు వెత్తిన ప్ర‌తిసారీ గోడ‌కు కొట్టిన బంతిలా రెట్టించిన ఉత్సాహంతో మ‌ళ్లీ త‌న స‌త్తాని చాటుకుంటూ లైమ్ లైట్‌లో నిలుస్తోంది.

ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తున్న కాజ‌ల్ తాజాగా సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు నెటిజ‌న్స్‌ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. కంప్లీట్ బ్లాక్ డ్రెస్‌లో థై షో చేస్తూ బ్లాక్ బెర్రీలా మెరిసిపోతోంది. ఇటీవ‌లే ఓ పార్టీలో పాల్గొన్న కాజ‌ల్ బాల్క‌నీలోకి చేరి చ‌ల్ల‌ని సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ చేతిలో మందు బాటిల్‌తో హోయ‌లొలికించింది. టైట్ ఔట్ ఫిట్‌లో కాజ‌ల్ చిరు న‌వ్వులు చిందిస్తున్న ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news