ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన టీ.సర్కార్

-

ప్రభుత్వ ఉద్యోగులకి తెలంగాణా ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. కరోనా కారణంగా కోత విధించిన వేతనాల బకాయిల చెల్లింపుల విధానాన్ని ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. కరోనా కారణంగా కోత విధించిన పెన్షనర్లకు అక్టోబర్, నవంబర్ లో రెండు విడతలుగా చెల్లించనున్నారు. అలానే కరోనా కారణంగా జీతాల్లో కోత విధించిన అధికారులు, సిబ్బందికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో మూడు విడతలుగా బకాయిలు చెల్లించనున్నారు.

ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు, పింఛన్లలో కోత విధించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది హైకోర్టుకు వెళ్ళారు. అయితే తగ్గించిన వేతనాలు, పింఛన్ల చెల్లింపులపై మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు పెన్షనర్ లకు రెండు నెలలలో, ఉద్యోగస్తులకి మూడు నెలలో బకాయిలు తీర్చనుంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news