నిన్న తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ప్రజలకు ఉపయోగపడే మరియు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా తాజాగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరొక శుభవార్తను అందించింది. రాష్ర్టంలో దివ్యంగులుగా ఉన్న వారికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందించడానికి నడుం బిగించింది BRS సర్కారు. సొంతంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వారికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలు అందించనున్నారు.. కాగా ఈ పథకంలో దివ్యంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీని ద్వారా ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది దివ్యాంగులు ఈ అవకాశాన్ని పొందే అవకాశం ఉంది. ఇందులో కూడా ఎస్సీ లకు 20%, ఎస్టీ లకు 10% , బీసీ మరియు మైనార్టీలకు 50 % రిజర్వేషన్ లను అందిస్తోంది.
ఈ పథకం నిజంగా తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది. మరి దీనికి సంబందించిన పూర్తి వివరాలు సంబంధిత అధికారుల వద్ద తెలుసుకోవాలని ప్రభుత్వం సూచించింది.