అక్రిడియేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం…!

తెలంగాణ సర్కార్ జర్నలిస్ట్ లకు గుడ్ న్యూస్ చెప్పింది. జర్నలిస్ట్ లకు అక్రిడియేషన్ కార్డులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే అక్రిడియేషన్ కార్డుల గడువును ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో 2022 జనవరి నుండి కొత్త అక్రిడియేషన్ కార్డులు అందజేస్తామని ప్రకటించింది.

కానీ కొత్త కార్డులు జారీ చేసేందుకు రాష్ట్ర స్థాయిలో…జిల్లా స్థాయిలో ఇప్పటివరకూ కమిటీలను ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అక్రిడియేషన్ కార్డుల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో చాలామంది జర్నలిస్ట్ లు అక్రిడియేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం తో మళ్లీ నిరాశే మిగిలింది.