పేద ప్రజలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..ఆ సేవలు బంద్..

-

పేద ప్రజల కోసం తెలంగాణ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు..ముఖ్యంగా వైద్య సేవలకు సర్కార్ ఎప్పుడూ కొత్త వాటిని అందుబాటులోకి తీసుకొని వస్తుంది..అయితే ఇప్పుడు ఉచిత వైద్య సేవల పై కీలక నిర్ణయం తీసుకుంది..వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 104 అంబులెన్స్‌ సేవలకు స్వస్థి పలికింది. 104 వాహనాల సేవలను రద్దు చేస్తూ జీవోను విడుదల చేసింది.

మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అంబులెన్స్‌ సేవలను కోల్పోనున్నారు.104 వాహనాల సేవలు నిలిచిపోనుండటంతో సర్వీసుకు పనిచేస్తున్న అంబులెన్సులను త్వరలో వేలం వేయనున్నట్టు ప‍్రభుత‍్వం తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న వాహనాలను వేలం వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సర్కార్ ఆదేశించింది.అంబులెన్సులు అమ్మగా వచ్చిన డబ్బులను వైద్య సేవలకు ఖర్చు చేయాలని సర్కారు ఆలొచిస్తున్నారు.

కాగా, 104 అంబులెన్స్​ సర్వీసులను 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప‍్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. మారుమూల ప్రాంతాల్లో బీపీ, షుగర్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి స్థానికంగా ట్రీట్​మెంట్​ అందించేందుకు ఈ అంబులెన్స్‌లను తీసుకువచ్చారు. ప్రభుత్వం ఈ వాహనాల్లో ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం, ల్యాబ్​టెక్నీషియన్, మెడికల్‌ అసిస్టెంట్‌, డ్రైవర్లను నియమించింది..ఈ నిర్ణయం వల్ల ప్రజలు నష్ట పోతారని, మరోసారి ఆలోచించాలని కొందరు ప్రముఖులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version