రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఇవాళ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు తెలిపారు చెన్నమనేని. అయితే చెన్నమనేని రమేష్ కౌంటర్ పై వివరణకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. అటు ఈ కేసు పై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు రెండు వారాలు గడువు ఇచ్చింది.
అలాగె… మరోసారి గడువు కోరవద్దని, తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు సూచనలు చేసింది. కాగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో వేములవాడ స్థానిక నాయకుడు ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై కోర్టు లో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది క్రితం కేంద్ర హోం శాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.