సిద్ధిపేటలో దారుణం.. ఎనిమిదో తరగతి బాలికపై పూజారి బరితెగింపు

-

ఎంతో గౌరవప్రదమైన పూజారి వృత్తికి కళంకం తెచ్చాడో వ్యక్తి. సిద్ధిపేటలో ఓ దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. ఓ వైపు గుడిలో పూజలు చేస్తూ, మరోవైపు ఎనిమిదో తరగతి బాలికతో ప్రేమాయణం కొనసాగించాడు ఓ పూజారి. ఏడాదిగా బాలికకు మాయమాటలు చెబుతూ లైంగిక దాడి చేస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి, సన్నిహితంగా గడిపి, ఇందుకు సంబంధించిన ఫొటోలను తీశాడు.

చివరకు పూజారి మహేందర్‌ (23)ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఆ బాలిక ఫొటోలను వాట్సప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేశాడని పోలీసులు గుర్తించారు. వాటిని చూసిన ఆ బాలిక తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. అతడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి, ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version