లైంగిక వేధింపులలో తెలంగాణకు ఎన్నో స్థానమో తెలుసా ?

-

ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అది లైంగిక వేధింపులు అలాగే గృహ వేధింపులు అని చెప్పక తప్పదు. మహిళ బయటికి వస్తుందంటేనే వారికి రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడ ఏ కామాంధుడు ఏ రూపంలో వచ్చి దాడి చేస్తాడో అన్న భయంతో చాలా మంది ఇళ్లకే పరిమితం అయిపోతున్నారు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. అలా అని ఇళ్ళలో ఉన్నవాళ్లు సేఫ్ అని కూడా చెప్పలేం ఎందుకంటే సొంత అన్నలు సొంత నాన్నలే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇంక వారికి రక్షణ ఎక్కడిది.

తాజాగా తెలంగాణలో 36.9% అలాగే ఏపీలో 30% మంది మహిళలు తమ తమ భర్తల చేతుల్లో గృహ అలాగే లైంగిక వేధింపులకు గురవుతున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తెలిపింది. ఈ లిస్టులో 44.4 శాతంతో కర్ణాటక మొదటి స్థానంలో నిలవగా 36.9 %తో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో బీహార్ 40 శాతంతో నిలిచింది. అలాగే 39%తో మణిపూర్ నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఈ సర్వే లాక్ డౌన్ కు ముందు చేసింది. ఈ లాక్ డౌన్ సమయంలోగృహ మరియు లైంగిక వేధింపులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజారోగ్య రంగం నిపుణులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version