తెలంగాణా ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం…!

-

కరోనా కారణంగా విద్యా వ్యవస్థ ఇప్పుడు నానా అవస్థలు పడుతుంది. విద్యార్ధుల భవిష్యత్తు ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. విద్యార్ధులకు పరిక్షల విషయంలో ప్రభుత్వాలు ఇప్పుడు క్రమంగా క్లారిటీ ఇస్తూ వస్తున్నాయి. విద్యార్ధులకు కాస్త ఈ నిర్ణయాలు ఉపశమనం కల్పిస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణా ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణా ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.

అందరిని పాస్ చేస్తున్నామని ప్రకటించింది. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయిన విద్యార్ధులు అందరిని పాస్ చేసింది. దీనితో లక్షా 47 వేల మంది విద్యార్ధులకు లబ్ది చేకూరుతుంది. దీనిపై విద్యార్ధులు వారి తల్లి తండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణా సర్కార్ పది పరీక్షలను రద్దు చేసింది. ఏపీ కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ విషయంలో ఏపీ ముందే నిర్ణయం తీసుకుంది. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణా సర్కార్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news