కర్ణాటక రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. మరి ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మేరకు బెంగళూరు నగరంలో కరొనాను తరిమికొట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని యడ్యూరప్ప ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈమేరకు యడ్యూరప్ప ప్రభుత్వ మంత్రివర్గం సమావేశమై కరోనా కట్టడికి తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
ఈ నేపథ్యంలో న్యాయ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జెసి మధు స్వామి మీడియాతో తెలిపారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా బెంగళూరు నగరాన్ని 8 జోన్లుగా విభజించారని సీఎం ఎడ్యూరప్ప నిర్ణయించారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి జోన్ కి ఒక్కో మంత్రి పూర్తి బాధ్యత వహించాలని, అలాగే అక్కడ జరుగుతున్న చర్యల పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు. ఇకపోతే నేటి వరకు కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 28877 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కేవలం బెంగళూరు మహానగరంలోని 12 వేల కేసులు పైగా నమోదయ్యాయి. దీంతో బెంగళూరు నగర ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.