తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల : ఇలా చెక్‌ చేసుకోండి

-

తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫీజు చెల్లించిన 4.51.585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని.. ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,28,754 మంది బాలికలు కాగా.. 2,22,831 మంది బాలురు ఉన్నారని మంత్రి చెప్పారు. మొత్తం ఉత్తీర్ణత సాధించిన వారిలో 176719 మంది విద్యార్థులు ఏ-గ్రేడ్‌, 104886 మంది బీ-గ్రేడ్‌, 61,887 మంది సి-గ్రేడ్‌, 108093 మంది విద్యార్థులు డి-గ్రేడ్‌ సాధించారని మంత్రి పేర్కొన్నారు.

కరోనా తీవ్రత కారణంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇంటర్‌ పరీక్షలను రద్దు చేశామని ఆమె తెలిపారు. అలాగే.. పరీక్షల ఫలితాల కోసం నిపుణుల కమిటీని నియమించామని గుర్తు చేశారు. ఇవాళ రిలీజ్‌ చేసిన ఇంటర్‌ ఫలితాలను http://examresults.ts.nic.in, http://examresults.cgg.gov.in వెబ్‌ సైట్లలో పొందవచ్చని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కాగా… ఇటీవలే ఇంటర్‌ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news