తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

-

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. తెలంగాణలో మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన వారు, ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నించేవారు ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు.

ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.  http://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్ సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.  ఇంటర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్ మెంట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలే పై చేయి సాధించారు. 2,54,498 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాయగా 63.86 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. 70.26 శాతం బాలికలు, 58.39 శాతం బాలురు పాస్ అయ్యారు. 1,38,477 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా 43.88 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. బాలికలు 47.54 శాతం, బాలురు 41.37 శాతం మంది పాస్ అయ్యారు. ఫలితాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 040 24655027 కి కాల్ చేయవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version