జాతీయస్థాయిలో మెడికల్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్ 2025’కు సన్నద్ధమవుతున్న బాలికల కోసం ఉచితంగా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు మెటామైండ్ అకాడమీ చైర్మన్ మనోజ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి ఈ తరగతులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాగా 25, 26, 27 మూడ్రోజులు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బాలికలకు ఉచిత హాస్టల్ వసతి సైతం కల్పిస్తున్నట్లు స్పష్టంచేశారు.
నీట్ సాధనలో ఎదురయ్యే సవాళ్లు, మొదటి ప్రయత్నంలోనే నీట్ ఎలా సాధించాలి, మెంటర్ షిప్, నోట్స్ ప్రిపరేషన్ తదితర అంశాలపై మెడికోలు, సీనియర్ అధ్యాపకుల ఆధ్వర్యంలో సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైద్య వృత్తిలో రెండు తెలుగు రాష్ట్రాల బాలికలు ముందుండాలనే లక్ష్యంతో ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి 100 మందికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పాఉ. రిజిస్ట్రేషన్ కోసం 8919926339 నంబర్ ను సంప్రదించాలని మనోజ్ కమార్ సూచించారు.