తెలంగాణాలో లాక్ డౌన్ ని మే 30 వరకు లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. తెలంగాణాలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రతీ రోజు కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం ప్రభుత్వాన్ని కూడా బాగా ఇబ్బంది పెడుతూ వస్తుంది. దీనితో లాక్ డౌన్ పెంచాలి అనే ఆలోచనలో తెలంగాణా సర్కార్ ఉంది అనే విషయ౦ నిన్నటి కేసీఆర్ మాటలతో అర్ధమైంది.
ఆయన లాక్ డౌన్ ని పెంచడానికి మొగ్గు చూపించి నిన్న లాక్ డౌన్ ని మే 7 వరకు పెంచుతున్నామని అన్నారు. కేంద్రం తో సంబంధం లేకుండా కేసీఆర్ ఈ నిర్ణయం వెల్లడించారు. లాక్ డౌన్ అంశం విషయంలో మే 5 న ఒకసారి కేబినేట్ సమావేశం ఉంటుందని ఆ రోజున తాము నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారు కేసీఆర్. అయితే కేసులు పెరిగితే మాత్రం లాక్ డౌన్ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం లేదని అర్ధమవుతుంది.
రోజు రోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక ఆర్ధికంగా కష్టాలు ఉన్నా సరే వెనక్కు తగ్గవద్దు అని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో కొత్తగా 18 కేసులు నమోదు అయ్యాయి. రాబోయే రెండు వారాల్లో హైదరాబాద్ పరిధిలో కేసులు పెరిగే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకే ఆయన పట్టుదలగా ఉన్నారని అర్ధమవుతుంది.