తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. జులైలో తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. ఇంటర్ పరీక్షల తేదీలు మారడంతో… జులై మొదటి లేదా రెండో వారంలో జరపాలని భావిస్తోంది. ఇంటర్ పరీక్షలు మే 7 వ తేదీతో ముగియాల్సి ఉండగా.. తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం.. మే 19న పూర్తవుతాయి.
ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్ కు సన్నద్దమయ్యేందుకు 45 రోజుల వ్యవధి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారం చూస్తే.. జులై మొదటి వారంలో ఎంసెట్ ను నిర్వహించాలని యోచిస్తున్నారు. మరో వైపు జులై 3 వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఉన్నందున ఎంసెట్ ను మొదటి వారంలో నిర్వహిస్తే.. విద్యార్థులకు ఇబ్బంది అవుతుందేమోనని అధికారులు ఆలోచన చేస్తున్నారు. అయితే.. జేఈఈ అడ్వాన్స్ డ్ కు సన్నద్దమయ్యే విద్యార్థులు ఎంసెట్ ను సునాయసంగా రాస్తారని. ప్రత్యేకంగా సిద్దం కావాల్సిన అవసరం లేదని కొందరు భావిస్తున్నారు.