తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేడు ప్రజా స్వామ్య పరిరక్షణ దీక్షను చేయనున్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజే.. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగ ఈ సస్సెన్షన్ ను సవాల్ చేస్తు.. బీజేపీ ఎమ్మెల్యే లు హై కోర్టును ఆశ్రయించారు. అయితే హై కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కానీ మరోసారి స్పీకర్ ను కలవాలని సూచించింది. అయితే స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అని తెల్చి చెప్పింది.
కాగ బీజేపీ ఎమ్మెల్యే లు స్పీకర్ ను కలసి అభ్యర్ధించగా.. స్పీకర్ తిరస్కరించారు. దీన్ని నిరసిస్తూ. బీజేపీ నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేయనుంది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీజేపీ ఎమ్మెల్యే లు ఈటల రాజేందర్, రఘునందన్, రాజా సింగ్ లు ఈ దీక్షలో పాల్గొంటారు. అంతే కాకుండా వీరికి మద్ధతుగా ఎంపీలు సోయం బాపురావు, అరవింద్, తో పాటు లక్ష్మణ్, డీకే అరుణ, మురళీధర్ రావు తో పాటు పలవురు బీజేపీ నాయకులు ఈ దీక్షలో కూర్చోనున్నారు.
కాగ నేడు బీజేపీ చేస్తున్న ప్రజా స్వామ్య పరిరరక్షణ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నగరంలో శాంతి భద్రతల విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. అందుకే అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు.