తెలంగాణాలో భారీ ఎత్తున మునిసిపల్ కమిషనర్ల బదిలీ..

తెలంగాణాలో భారీ ఎత్తున మునిసిపల్ కమిషనర్ల బదిలీ జరిగింది. తెలంగాణాలో బ‌దిలీలు ఈ మేరకు ఉన్నాయి. క‌రీంన‌గ‌ర్‌లో అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న బోన‌గిరి శ్రీ‌నివాస్‌ బోడుప్ప‌ల్ మునిసిప‌ల్‌కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ అయ్యారు. నార్సింగ్ మునిసిపాలిటీ క‌మిష‌న‌ర్‌గా చేస్తున్న శ్రీ‌నివాస‌రెడ్డి తాండూరు మునిసిపాలిటీ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ అయ్యారు. నార్సింగ్ మునిసిపాలిటీ క‌మిష‌న‌ర్‌గా స‌త్య‌బాబు నియ‌మితుల‌య్యారు.

జ‌హీరాబాద్‌లో క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న విక్రం సింహారెడ్డి(శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్‌) కొల్లాపూర్ మునిసిపాలిటీ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ అయ్యారు. కొల్లాపూర్‌ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న వెంక‌ట‌య్య‌ దేవ‌ర‌కొండ‌కు క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ అయ్యారు. దేవ‌ర‌కొండ క‌మిష‌న‌ర్‌గా ఉన్న పూర్ణ‌చంద‌ర్‌రావు భువ‌న‌గిరికి బ‌దిలీ అయ్యారు. జ‌న‌గామ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న ర‌వీంద‌ర్‌ మ‌హ‌బూబాబాద్‌కు బ‌దిలీ అయ్యారు. జ‌న‌గామ మునిపాలిటీ క‌మిష‌న‌ర్‌గా ఎస్‌. స‌మ్మ‌య్య నియ‌మితుల‌య్యారు. నేరేడుచ‌ర్ల మునిసిపాలిటీ క‌మిష‌న‌ర్‌గా గోప‌య్య నియ‌మితుల‌య్యారు. కోదాడ మునిసిపాలిటీలో శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్ గా చేస్తున్న దండు శ్రీ‌నివాస్‌ తిరుమ‌ల‌గిరి మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ అయ్యారు.