హైదరాబాద్ లో రోడ్ ఎక్కుతున్నారా ? జర జాగ్రత్త !

హైదరాబాద్ లో రోడ్డు ఎక్కాలనుకుంటే జాగ్రత్త సుమా. ఎందుకంటే హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌ చేస్తే 3 నెలలు డ్రైవింగ్‌ లైసెన్స్‌పై సస్పెన్షన్‌ చేసే ఛాన్స్ ఉంది. అలానే రెండో సారి హెల్మెట్‌ లేకుండా దొరికితే లైసెన్స్‌ జీవిత కాలం రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ర్యాష్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, ఓవర్‌ స్పీడ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌ సిగ్నల్‌ జంపింగ్‌లకు కూడా ఇవే నిబంధనలు వర్తించనున్నాయి.

ఇప్పటికే సైబరాబాద్‌లో ఈ రూల్ అమలుచేస్తున్నారు పోలీసులు. ఇప్పటిదాకా ఆకతాయితనంతో రోడ్డుపై ఇష్టారీతిన వాహనం నడిపితే నడిపారు. ఇక నుండి అయినా జాగ్రత్తగా ఉండండి. రోడ్డు ప్రమాదాలు చిన్న చిన్న పొరపాటుల వల్లనే చోటు చేసుకుంటున్నాయని భావిస్తున్న ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సో ఎలా పడితే అలా రోడ్డు ఎక్కకండి, రోడ్డు ఎక్కే ముందు హెల్మెట్ లేకపోతే ఇక ఇబ్బంది పడక తప్పదు. సో బీ కేర్ ఫుల్ మరి.